ఆయిల్​పామ్​లో అంతర పంటగా పసుపు : మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

by Muthe.Rajitha |

ఆయిల్ పామ్ లో అంతర పంటగా పసుపు సాగు చేసే అవకాశాలను పరిశీలించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సూచించారు.

ఆయిల్​పామ్​లో అంతర పంటగా పసుపు : మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆయిల్ పామ్ లో అంతర పంటగా పసుపు సాగు చేసే అవకాశాలను పరిశీలించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సూచించారు. గురువారం సచివాలయంలో ఆయనను పసుపు బోర్డు సెక్రటరీ భవాని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుర్క్ మిన్ పసుపులో అధికంగా వచ్చే నూతన రకాల సాగు, పురుగు,కలుపు రకాల వినియోగం తగ్గించడం ద్వారా మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు. పసుపు ఉత్పత్తులకు ఫార్మా, ఆయుర్వేద రంగంలో ఉన్న అవసరాల దృష్ట్యా బోర్డు ద్వారా మార్కెటింగ్ లింకేజీలు కల్పించాలని కోరారు.

ఆదేవిదంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి సంపూర్ణ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అనంతర సెక్రటరీ భవాని కొత్తగా ఏర్పాటైన పసుపు బోర్డు గత ఆరు నెలలుగా చేపట్టిన కార్యక్రమం వివరాలను మంత్రికి వివరించారు. కోత అనంతరం ఉపయోగపడే పసుపు ఉడకబెట్టే యంత్రాలు , పాలిషర్స్ , గ్రైండర్లు లాంటి వాటిని రైతులకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. పసుపు రైతు ఉత్పత్తి సంఘాలను గుర్తించి వారికి రూ. 23 లక్షల వరకు రాయితీ కల్పించి, కోత అనంతరం పసుపులో అవసరమయ్యే పనిముట్లను ,యంత్రాలను అందిస్తున్నట్లు వెల్లడించారు.

రైతులకు ఐపీఎం పద్దతుల్లో , ఆర్గనిక్​సర్టిఫికేషన్​లో తోడ్పడుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం పసుపును పౌడర్​రూపంలో ఐటీసీ, పతాంజలి వంటి వివిద కంపెనీలు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు.తూర్పు , మద్యమ దేశాలకు సరఫరా చేసే ఒక ప్రముఖ కంపెనీ 10 ఎకరాల స్థలంలో ప్రాసెసింగ్ యూనిట్ కూడా నిజామాబాద్ లో స్థాపించడానికి ముందుకు వచ్చిందని పేర్కొన్నారు.

Next Story