- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎట్టకేలకు ఫలించిన చర్చలు.. పత్తి కొనుగోళ్లు షురూ
ఎట్టకేలకు సీసీఐ, జిన్నింగ్ మిల్లర్లకు మధ్య చర్చలు సఫలం కావడంతో తెలంగాణలో పత్తి కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయి.

దిశ, వెబ్ డెస్క్ : ఎట్టకేలకు సీసీఐ, జిన్నింగ్ మిల్లర్లకు మధ్య చర్చలు సఫలం కావడంతో తెలంగాణలో పత్తి కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయి. దీంతో పత్తి కొనుగోళ్లపై సీసీఐ, జిన్నింగ్ మిల్లర్ల మధ్య నెలకొన్న వివాదాలకు తెర పడినట్లయింది. సీసీఐ విధించిన కొన్ని కఠిన నిబంధనలను మిల్లర్లు తీవ్రంగా వ్యతిరేకించడంతో రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే ఈ వివాదం ఈ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వద్దకు వెళ్లగా.. ఆయన స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
తుమ్మల నాగేశ్వరరావు సీసీఐ అధికారులు, జిన్నింగ్ మిల్లర్లతో పలుమార్లు చర్చలు జరిపి అనంతరం కేంద్ర మంత్రులు, సీసీఐ సీఎండీ అధికారులతో మాట్లాడి నిబంధనల్లో మార్పులు చేయించారు. ఫలితంగా రాష్ట్రంలో నోటిఫై చేసిన 330 జిన్నింగ్ మిల్లులన్నీ మళ్లీ పత్తి కొనుగోళ్లను ప్రారంభించనున్నాయి. ఇప్పటివరకు సీసీఐ 3.66 లక్షల టన్నుల పత్తిని సేకరించగా, రైతుల వద్ద మిగిలిన మొత్తం పత్తిని పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేలా ఇకపై సీసీఐ, జిన్నింగ్ మిల్స్ పనిచేస్తాయని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు.






