Tummala: కేసీఆర్‌కు గౌరవం లేకుండా చేస్తున్నావ్.. కేటీఆర్ పై తుమ్మల ఫైర్

by Prasad Jukanti |

కేటీఆర్‌వి సిగ్గులేని మాటలని తుమ్మల ఫైర్ అయ్యారు

Tummala: కేసీఆర్‌కు గౌరవం లేకుండా చేస్తున్నావ్.. కేటీఆర్ పై తుమ్మల ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: పదేళ్లు అధికారంలో ఉండగా రైతుల గురించి మాట్లాడని కేటీఆర్ ఈ ఏడాది కాలంలో రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఏంటని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతుల పరిస్థితి అద్వానంగా మార్చారని దుయ్యబట్టారు. సోమవారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన తుమ్మల.. రైతుల వద్ద కేసీఆర్ కు ఉన్న కాస్తో కూస్తో ఉన్న గౌరవం కేటీఆర్ తీస్తున్నారని ఫైర్ అయ్యారు. రైతుల గురించి ఏనాడు ఆలోచన చేయని కేటీఆర్ ఇవాళ సిగ్గులేకుండా మాపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతుల ఆత్మహత్యలను ప్రోత్సహించే విధంగా కేటీఆర్ వ్యాఖ్యలు మండిపడ్డారు. ఇకనైనా కేటీఆర్ వ్యవసాయ శాఖ అంశాన్ని వదిలేస్తే బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా లాభం దక్కుతుంది. లేదంటే ఎంపీ ఎలక్షన్స్ లో వచ్చిన ఫలితాలే రిపీట్ అవుతాయని విమర్శించారు.

కేసీఆర్ ఫ్యామిలీకి రైతుభరోసా ఇస్తాం:

పదేళ్ల ప్రభుత్వంలో రైతుబంధు ఎంత ఇచ్చామో అనే సోయి లేకుండా కేటీఆర్ (KTR) వ్యాఖ్యలు చేస్తున్నారని తుమ్మల దుయ్యబట్టారు. కేసీఆర్ (KCR), కేటీఆర్, హరీష్ రావు (Harish Rao) తో పాటు అందరికీ సాగుకు యోగ్యమైన భూమికి రైతు భరోసా (Rythu Bharosa) ఇస్తామన్నారు. గత ప్రభుత్వంలో రాళ్ళు - గుట్టలకు సైతం రైతుబంధు ఇచ్చారని ఆ లెక్కలు త్వరలోనే బయటకు వస్తాయన్నారు. శాటిలైట్ ఇమేజ్ తో వ్యవసాయ భూమి లెక్కలు తీసే పని మొదలు అయిందని వెల్లడించారు.

Next Story