- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో నేడు తుమ్మల భేటీ.. యూరియాపై కీలక అభ్యర్థన చేసే చాన్స్!
తెలంగాణలో గత నెల రోజులుగా యూరియా సరఫరాపై ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో గత నెల రోజులుగా యూరియా సరఫరాపై ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి. పీఏసీఎస్‌ల ఎదుట రైతులు వ్యవసాయ పనులను సైతం వదిలేసి యూరియా కోసం క్యూ కడుతున్నారు. ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ (BRS) యూరియాపై ఆందోళనలకు దిగింది. ఈ నేపథ్యంలోనే కీలక పరిణామం చోటుచేసుకోబోంది. ఇవాళ ఢిల్లీలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Thummala Nageshwar Rao), కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డా (JP Nadda)లను భేటీ కాబోతున్నారు. ఈ సందర్భంగా రానున్న 10 రోజుల వ్యవధిలో తెలంగాణకు మరో 60 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలని విజ్ఞప్తి చేయబోతున్నారు.
అదేవిధంగా వ్యవసాయ, ఉద్యాన సమస్యలపై సంబంధిత మంత్రులను మంత్రి తుమ్మల కలవనున్నారు. కాగా, సోమవారం రాత్రి ఒక్కరోజే రాష్ట్రానికి 9 వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించనున్నారు. అదేవిధంగా మంగళవారం మరో 5 వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని తెలిపారు. మొత్తంగా మరో వారం రోజుల్లో తెలంగాణకు కేంద్ర నుంచి 27 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కానుందని పేర్కొన్నారు. యూరియా సరఫరాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.






