TTGDA: బదిలీల అర్హత కాలాన్ని రెండేళ్లకు తగ్గించాలి

by Gantepaka Srikanth |

ప్రభుత్వ వైద్యుల బదిలీల అర్హత కాలాన్ని ప్రస్తుతం ఉన్న మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించాలని తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీటీజీడీఏ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

TTGDA: బదిలీల అర్హత కాలాన్ని రెండేళ్లకు తగ్గించాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ వైద్యుల బదిలీల అర్హత కాలాన్ని ప్రస్తుతం ఉన్న మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించాలని తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీటీజీడీఏ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బొల్లెపాక కిరణ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ కిరణ్ మాదల బుధవారం ఒక ప్రకటనలో తమ డిమాండ్లను వెల్లడించారు. బదిలీల ప్రక్రియలో పారదర్శకత, న్యాయం చేకూరాలంటే మాండేటరీ, రిక్వెస్ట్ ట్రాన్స్‌ఫర్ జాబితాలను వేర్వేరుగా నిర్వహించాలని వారు కోరారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 40 శాతం బదిలీల కోటాను యథాతథంగా కొనసాగించాలని, అలాగే బదిలీల్లో యూనియన్ ప్రతినిధులకు మినహాయింపునిచ్చే జీఓ ఎంఎస్ నం. 185 (2025)ను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ఆసిఫాబాద్, కొత్తగూడెం వంటి మారుమూల ప్రాంతాల్లోని వైద్య కళాశాలలను హార్డ్‌షిప్ ఏరియాలుగా ప్రకటించి, అక్కడ పనిచేస్తున్న ఫ్యాకల్టీకి తగిన మద్దతు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Next Story