కడపలో టీడీపీ ‘మహానాడు’

by Naga Rani Yarlagadda |

తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుక ఏపీలోని కడపలో మే 27 వ తేదీ నుండి మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ ‘మహానాడు’ వేడుకను విజయవంతంగా నిర్వహించుకోవడంపై తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర పార్టీ ముఖ్యనాయకుల సమావేశం శుక్రవారం హైదరాబాద్​లోని ఎన్‌టిఆర్‌ భవన్‌లో జరిగింది.

కడపలో టీడీపీ ‘మహానాడు’
X
  • మే 27 నుంచి మూడు రోజుల పాటు నిర్వహణ
  • మహానాడును విజయవంతం చేద్దాం
  • టీటీడీపీ నేతల భేటీ

దిశ, తెలంగాణ బ్యూరో: తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుక ఏపీలోని కడపలో మే 27 వ తేదీ నుండి మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ ‘మహానాడు’ వేడుకను విజయవంతంగా నిర్వహించుకోవడంపై తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర పార్టీ ముఖ్యనాయకుల సమావేశం శుక్రవారం హైదరాబాద్​లోని ఎన్‌టిఆర్‌ భవన్‌లో జరిగింది. మహానాడును విజయవంతం చేద్దామని ఈ సందర్భంగా టీ టీడీపీ నిర్ణయించింది. ముఖ్యంగా టీడీపీ మహానాడుకు ఆహ్వానితులు, తీర్మానాలు, వేడుకకు వసతి సౌకర్యాలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించి.. నాయకుల నుంచి సలహాలను, సూచనలు స్వీకరించారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ నుంచి 6 తీర్మానాలను కేంద్ర పార్టీ ఆమోదం కొరకు పంపాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. పార్టీ పొలిట్‌బ్యూరో స్థాయి నుంచి గ్రామ పార్టీ కమిటీ వరకు ‘మహానాడు’ కు ఆహ్వానం పంపాలని నిర్ణయించారు. తెలంగాణ నుండి వెళ్లే నేతలకు కడపలో వసతి ఏర్పాట్లపై కూడా సమీక్ష చేశారు. అత్యంత క్రమశిక్షణతో పాల్గొని మహానాడు వేడుకను విజయవంతం చేద్దామని పార్టీ నాయకులను, శ్రేణులను పార్టీ నేతలు కోరారు. ఈ కార్యక్రమంలో పొలిట్‌బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

పద్మభూషణ్‌ బాలయ్యకు అభినందన

పద్మభూషణ్‌ అవార్డు అందుకున్న పొలిట్‌బ్యూరో సభ్యులు, హిందూపూర్‌ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు అభినందనలు తెలుపుతూ టీ టీడీపీ సమావేశం తీర్మానం చేసింది. ఈ సమావేశంలో పొలిట్‌బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు, అరవింద్‌ కుమార్‌ గౌడ్‌, జాతీయపార్టీ అధికార ప్రతినిధి, టీటీడీ బోర్డు మెంబర్‌ నన్నూరి నర్సిరెడ్డి, పార్లమెంట్‌ అడ్‌హాక్‌ కమిటీ కన్వీనర్లు పిన్నమనేని సాయిబాబా, నందమూరి సుహాసిని, అజ్మీరా రాజునాయక్‌, గడ్డి పద్మావతి, సూర్యదేవర లత, భవనం షకీలారెడ్డి, తెలంగాణ తెలునాడు కల్లుగీత కార్మిక సంగం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సూరగౌని గజేందర్ గౌడ్ , శ్రీపతి సతీష్‌ కుమార్‌ , తెలుగుదేశం ప్రకాశ్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story