TSRTC MD సజ్జనార్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్

by Disha Web Desk |
TSRTC MD సజ్జనార్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
X

దిశ, డైనమిక్ బ్యూరో : వరుసగా ప్రముఖ సంస్థలు, సినీ, రాజకీయ ప్రముఖుల సోషల్‌మీడియా ఖాతాలు హ్యాక్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా, టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ట్విటర్ అకౌంట్‌ హ్యాకింగ్‌కు గురైంది. ఈ విషయాన్ని టీఎస్‌ఆర్టీసీ సంస్థ ధృవీకరించింది. అన్ని భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ సజ్జనార్‌ ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాకింగ్‌కు గురికావడం చాలా దురదృష్టకర సంఘటన అని టీఎస్‌ఆర్టీసీ పేర్కొంది. ప్రస్తుతం సదరు అకౌంట్‌ నుంచి ఎటువంటి ట్వీట్లను చేయడం కానీ రిప్లై ఇ‍వ్వడం కానీ జరగడం లేదని టీఎస్‌ఆర్టీసీ పీఆర్‌వో పేర్కొన్నారు. ట్విట్టర్‌ అకౌంట్‌ను పునరుద్ధరించే పనిలో ఉన్నామని , దీనికి ట్విట్టర్‌ సపోర్ట్‌ తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

Next Story

Most Viewed