టీఎస్‌పీఎస్సీని వెంటనే ప్రక్షాళన చేయాలి: నాగరాజు గౌడ్ డిమాండ్

by Disha Web Desk 19 |
టీఎస్‌పీఎస్సీని వెంటనే ప్రక్షాళన చేయాలి: నాగరాజు గౌడ్ డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్ పీఎస్సీ లీకేజీ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లివెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ ఎదుట ఓయూ ఐక్య విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను శనివారం దహనం చేశారు. తెలంగాణ ప్రభుత్వం 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని జేఏసీ నేత బైరు నాగరాజు గౌడ్ విమర్శలు చేశారు. టీఎస్ పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, కార్యదర్శి, సభ్యులను తొలగించకుండా సీఎం కేసీఆర్ కాపాడుతున్నారని ఆయన ఆరోపించారు.

టీఎస్ పీఎస్సీని ప్రక్షాళన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు భరోసా ఇచ్చే వరకు ఉద్యమం ఆగదని హెచ్చరించారు. కూతరు, ఎమ్మెల్సీ కవితను లిక్కర్ కుంభకోణం నుంచి కాపాడేందుకు రాష్ట్ర మంత్రులను ఢిల్లీ తరలించిన కేసీఆర్.. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంపై ఇంత నిర్లక్ష్యం ఎందుకని ఆయన ప్రశ్రించారు. ఈ కార్యక్రమంలో ఓయూ ఐక్య విద్యార్ధి సంఘాల నాయకులు బోనాల నగేష్, బండి నరేష్, కంపటి వెంకట్, భీమ్ సేన్, శంకర్, నవీన్, వంశీ, సంపత్, సందీప్, శేఖర్, ఆంజనేయులు, మహేష్, రాము, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed