- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాల్వంచలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి యూనిట్‌ను నెలకొల్పాలి.. టీఎస్‌పీఈయూ వినతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో 800 మెగావాట్ల విద్యుత్‌ఉత్పత్తి యూనిట్‌ను నెలకొల్పాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ (1535) యూనియన్ విజ్ఞప్తి చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో 800 మెగావాట్ల విద్యుత్‌ఉత్పత్తి యూనిట్‌ను నెలకొల్పాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ (1535) యూనియన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శనివారం 1535 యూనియన్ సెంట్రల్ కమిటీ అధ్యక్షులు ఎంఏ వజీర్, సెంట్రల్ కమిటీ సెక్రటరీ డి.రాధాకృష్ణ నేతృత్వంలోని విద్యుత్ఉద్యోగుల బృందం పాల్వంచలో డిప్యూటీ సీఎంను కలిసి వినతిపత్రం అందజేసింది. ముఖ్యంగా విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి ఈపీఎఫ్నుంచి జీపీఎఫ్‌కు మార్చాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా విద్యుత్ఆర్టీజన్కన్వర్షన్ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకుని 20 వేల మంది ఆర్టిజన్లకు న్యాయం చేయాలని కోరారు.
1999 సంవత్సరం ఫిబ్రవరి 1 తర్వాత చేరిన వారందరినీ వారి విద్యార్హతలను బట్టి ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించి వారికి న్యాయం చేయాలని విన్నవించారు. ఇన్నాళ్లు కోరుతూ వస్తున్నప్పటికీ ఐడీ నంబర్లను ప్రశ్నించే వారని, అవి తమ వద్ద ఉన్నాయని చూపిస్తున్నప్పటికీ ఉన్నతాధికారులు సరైన న్యాయం చేయడం లేదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకుని ఆర్టిజన్కన్వర్షన్విషయంలో న్యాయం చేయాలని కోరారు. గతంలో1998 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సంస్థలో జెన్‌కోలో, ఐడల్ కంపెనీలలో 5 వేల మంది కార్మికుల్ని పర్మినెంట్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టికి గుర్తు చేశారు. కాగా, యూనియన్ విజ్ఞప్తి2పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించి డిమాండ్ల పరిష్కారం కోసం హామీ ఇచ్చినట్లు ఎంఏ వజీర్, డి.రాధాకృష్ణ తెలిపారు.






