ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్‌లో వెయిటేజీ మార్కులు కలపాలి.. సీఎస్‌కు TS UTF వినతి

by Kema Shiva Kumar |

ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత మార్కులు జనరల్, బీసీ కేటగిరీ వారికి 40 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 30 శాతంగా తగ్గించాలని లేదా ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు సర్వీసును బట్టి 5 నుంచి 20 వెయిటేజీ మార్కులు కలపాలని కోరుతూ టీఎస్ యూటీఎఫ్ నాయకులు సీఎస్‌కు వినతిపత్రం అందజేశారు

ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్‌లో వెయిటేజీ మార్కులు కలపాలి.. సీఎస్‌కు TS UTF వినతి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత మార్కులు జనరల్, బీసీ కేటగిరీ వారికి 40 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 30 శాతంగా తగ్గించాలని లేదా ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు సర్వీసును బట్టి 5 నుంచి 20 వెయిటేజీ మార్కులు కలపాలని కోరుతూ టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు వినతిపత్రం అందజేశారు. ప్రధానంగా బయోలాజికల్ సైన్స్, భాషోపాధ్యాయులు సబ్జెక్టుకు సంబంధం లేని సిలబస్‌లో ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వచ్చినందున, వయస్సు, ప్రిపరేషన్ తదితర ప్రతికూలతల వలన ఉత్తీర్ణతా శాతం తక్కువగా ఉందని, వారికి ఉపశమనం కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని రవి కోరారు. సానుకూలంగా స్పందించిన సీఎస్, విద్యాశాఖ కార్యదర్శితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

Next Story