High Court : నల్లగొండ బీఆర్ఎస్ రైతు ధర్నాకు హైకోర్టు పర్మిషన్

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-01-22 11:16:17  IST  )

నల్లగొండ(Nalgonda)లో బీఆర్ఎస్(BRS) తలపెట్టిన రైతు మహాధర్నాకు హైకోర్టు(High Court)అనుమతి(Permission)ఇచ్చింది.

High Court : నల్లగొండ బీఆర్ఎస్ రైతు ధర్నాకు హైకోర్టు పర్మిషన్
X

దిశ, వెబ్ డెస్క్ : నల్లగొండ(Nalgonda)లో బీఆర్ఎస్(BRS) తలపెట్టిన రైతు మహాధర్నాకు హైకోర్టు(High Court)అనుమతి(Permission)ఇచ్చింది. నల్లగొండలో ఈనెల 28వ తేదీన క్లాక్ టవర్ సెంటర్ లో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు బీఆర్ఎస్ రైతు ధర్నా కార్యక్రమానికి హైకోర్టు అనుమతించింది. మంగళవారం జరుగాల్సిన రైతు మహాధర్నాకు జిల్లా యంత్రాంగం అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది.

బీఆర్ఎస్ పిటీషన్ ను విచారించిన హైకోర్టు రైతు మహాధర్నాకు షరతులతో కూడిన అనుమతినిచ్చింది. కాంగ్రెస్‌ సర్కార్‌ రైతులకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 21న‌ నల్లగొండలో బీఆర్‌ఎస్ పార్టీ తలపెట్టిన రైతు మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాక‌రించిన సంగ‌తి తెలిసిందే. దీనికి సంబంధించి జిల్లా నాయకులు ఏర్పాట్లు పూర్తి చేసిన‌ప్పటికీ, జిల్లాలో గ్రామ సభలు, సంక్రాంతి రద్దీ కారణంగా బందోబస్తు ఇవ్వలేమంటూ జిల్లా పోలీసులు ధర్నాకు అనుమతి నిరాకరించారు.

దీంతో బీఆర్ఎస్ రైతు ధ‌ర్నా అనుమతి కోసం హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీకరించిన కోర్టు.. బీఆర్ఎస్ రైతు మ‌హాధ‌ర్నాకు అనుమ‌తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 28వ తేదీన జరిగే బీఆర్ఎస్ రైతు మ‌హాధ‌ర్నాకు పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డి, ప‌లువురు నాయ‌కులు హాజ‌రు కానున్నారు.

Next Story