TS Elections : పోలింగ్ వేళ వివాదంలో చిక్కుకున్న కవిత

by Sathputhe Rajesh |   (  Updated:2023-11-30 04:24:51  IST  )

తెలంగాణ ఎన్నికల పోలింగ్ వేళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీరు వివాదాస్పదమయింది.

TS Elections : పోలింగ్ వేళ వివాదంలో చిక్కుకున్న కవిత
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎన్నికల పోలింగ్ వేళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీరు వివాదాస్పదమయింది. ఓటర్లు కారు గుర్తుకే ఓటు వేస్తారని, బీఆర్ఎస్‌కు ఓటు వేయాలని కవిత చెప్పారని ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయడం ఏంటని కాంగ్రెస్ ఫైర్ అయింది. కవిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

కవితపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. హైదరాబాద్‌లో కవిత ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన అనంతరం కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. ఈసీ ఈ వ్యవహారంలో ఎలా రియాక్ట్ అవుతుందో అనే ఉత్కంఠ నెలకొంది.

Next Story