TS Elections : ఎగ్జిజ్‌పోల్స్‌పై సీఈసీ కీలక నిర్ణయం

by Sathputhe Rajesh |

తెలంగాణలో పోలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది.

TS Elections :  ఎగ్జిజ్‌పోల్స్‌పై సీఈసీ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పోలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. ఉదయం మందకోడిగా సాగిన పోలింగ్ 11 గంటలకు 20.64 శాతంగా నమోదైంది. ఇక, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. సాయంత్రం 5.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల చేసుకోవచ్చని ప్రకటించింది. కాగా సాయంత్రం 6.30 గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల చేయాలని గతంలో ఆదేశించిన ఎన్నికల సంఘం ఆ సమయంలో తాజాగా మార్పులు చేసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.

Next Story