బీఆర్ఎస్‌కు పోటీగా టీఆర్ఎస్(డీ).. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గులాబీ పార్టీకి మరో షాక్!

by Prasad Jukanti |   (  Updated:2025-10-11 11:40:08  IST  )

జూబ్లీహిల్స్ బై పోల్ లో బీఆర్ఎస్‍కు టీఆర్ఎస్ రూపంలో షాక్ తగలబోతోందా?

బీఆర్ఎస్‌కు పోటీగా టీఆర్ఎస్(డీ).. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గులాబీ పార్టీకి మరో షాక్!
X

దిశ, డైనమిక్ బ్యూరో/ హిమాయత్ నగర్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నికకు నగారా మోగింది. ఎల్లుండి నుంచి ఇక్కడ నామినేషన్ల ప్రక్రియ షురూ కాబోతోంది. ఈ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు అధికార కాంగ్రెస్, బీజేపీలు ప్రణాళికలు ఎలా ఉన్నా తమ సిట్టింగ్ స్థానమైన జూబ్లీహిల్స్ ను చేజారకుండా కాపాడుకోవాలని బీఆర్ఎస్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఉప ఎన్నికలో సత్తా చాటడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో తమ వెయిట్ అండ్ స్ట్రెంత్ తగ్గలేదని నిరూపించుకోవడం కారు పార్టీకి అనివార్యంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్‍కు టీఆర్ఎస్ రూపంలో ఓ షాకింగ్ న్యూస్ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ బరిలో నిలిచేందుకు తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ (Telangana Rakshana Samithi) (టీఆర్ఎస్-డి) రెడీ అంటోంది. ఇదే జరిగితే తమకు బీఆర్ఎస్‍కు ఏ మేరకు డ్యామేజ్ కాబోతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

అభ్యర్థిగా మహిళా నేత

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో (Jubilee Hills by-election) టీఆర్ఎస్ (డీ) పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు నరాల సత్యనారాయణ తెలిపారు. ఇవాళ బషీర్‍బాగ్ ప్రెస్ క్లబ్లో పార్టీ జెండాను, వెబ్‍సైట్‍ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆశయాలకు ఆకాంక్షలకు అనుగుణంగా లోగో రూపకల్పన చేశామని చెప్పారు. టీఆర్ఎస్ (డీ) (TRS-D) నూతన జెండా తెలంగాణ ప్రతిబింబాన్ని తెలియజేస్తుందని తెలిపారు. జూబ్లీహిల్స్ లో తమ పార్టీ అభ్యర్థిగా టీఆర్ఎస్-డి వర్కింగ్ ప్రెసిడెంట్ కంచర్ల మంజూష పోటీ చేయబోతున్నారని ప్రకటించారు. ఈ ఉపఎన్నికలో మా పార్టీ గట్టి పోటీ ఇవ్వబోతోందని ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ కు టెన్షన్ తప్పదా?:

ఈ ఎన్నికను చాలెంజ్ గా తీసుకున్న బీఆర్ఎస్‍కు టీఆర్ఎస్-డీ పోటీ ఎలాంటి ఎఫెక్ట్ చూపబోతోందని అనేది ఆసక్తిగా మారింది. క్షేత్రస్థాయి ఓటర్లలో బీఆర్ఎస్ కంటే టీఆర్ఎస్ అనేదే ఎక్కువ మందికి తెలిసిన పేరు కావడం టీఆర్ఎస్-డీ జెండా రంగు సైతం దాదాపు బీఆర్ఎస్‍ను పోలిన గులాబీ రంగు ఉండటం హాట్ టాపిక్ గా మారింది. చిన్న పార్టీలే కదా అని తక్కువ అంచనా వేస్తే గతంలో బీఆర్ఎస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకున్న పరిస్థితులు చాలా ఉన్నాయి. గతంలో కారు గుర్తును పోలి ఉన్న రోడ్డు రోలర్ & రోటీ మేకర్‌ సింబర్స్ గూలాబీ పార్టీని గుబులు పెట్టించింది. కొన్ని స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణం అయిన హిస్టరీ సైతం ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే జూబ్లీహిల్స్ బై పోల్ లో సింబల్స్ టెన్షన్ అలా ఉంచితే ఇప్పుడు ఒకే రకమైన రంగుతో తమ పార్టీ పాత పేరుతో టీఆర్ఎస్-డీ బరిలోకి రాబోతుడటం బీఆర్ఎస్ పార్టీపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది అనేది వేచి చూడాలి.

Next Story