'కేసీఆర్ ఎంట్రీ కోసం కంట్రీ వెయిట్ చేస్తోంది'

by Disha Web Desk 2 |
కేసీఆర్ ఎంట్రీ కోసం కంట్రీ వెయిట్ చేస్తోంది
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీపై ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదని అన్నారు. దమ్ముంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు అమలు చేసి చూపించాలని సవాల్ విసిరారు. ఎనిమిదేళ్ల మోడీ పాలనలో దేశ ప్రజలు విసుగెత్తిపోయారని విమర్శించారు. దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కేసీఆర్ ఎంట్రీ కోసం కంట్రీ వెయిట్ చేస్తోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు.

Also Read: కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు.. ప్రారంభమైన వెంటనే జరిగేది ఇదే!

Next Story

Most Viewed