ప్రొఫెసర్ నాగేశ్వర్‌ అరెస్ట్ ప్లాన్‌పై టీఆర్ఎస్ ఫైర్

by Malleboina Mahesh |

ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై ఏపీలో కేసులను టీఆర్ఎస్ ఖండించింది. హైదరాబాద్‌లో ఆయన్ను అరెస్ట్ చేస్తే చంద్రబాబు నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించింది.

ప్రొఫెసర్ నాగేశ్వర్‌ అరెస్ట్ ప్లాన్‌పై టీఆర్ఎస్ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన వరుస పోలీస్ కేసుల వ్యవహారంపై తెలంగాణ రక్షణ సేన (TRS) తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షురాలు కల్లకుంట్ర కవిత ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అందులో.."వాక్‌స్వాతంత్ర్యాన్ని కాపాడటం రాజ్యాంగబద్ధమైన హక్కు అని, నాగేశ్వర్‌పై జనసేన పార్టీ (JSP) నాయకుల ఫిర్యాదులతో ఏపీ పోలీసులు కక్షపూరితంగా కేసులు పెట్టడం పూర్తిగా ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఒకవేళ ఏపీ పోలీసులు హైదరాబాద్‌కు వచ్చి నాగేశ్వర్‌ను అరెస్ట్ చేయాలని చూస్తే.. దానిని తెలంగాణ మేధావి వర్గంపై జరిగిన దాడిగా భావిస్తామని, తీవ్ర పరిణామాలు ఉంటాయని టీఆర్ఎస్ హెచ్చరించింది.

ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో.. కేంద్ర మంత్రి అమిత్ షా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీకి సంబంధించి నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలను ఆయన బేషరతుగా ఉపసంహరించుకున్నాక కూడా వేధించడం సరికాదని పేర్కొంది. ఏపీ పోలీసులకు తెలంగాణ పోలీసులు సహకరించడంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. హైదరాబాద్‌లో నాగేశ్వర్‌ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే తాము ఊరుకోబోమని, అవసరమైతే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నివాసాన్ని ముట్టడిస్తామని టీఆర్ఎస్ అల్టిమేటం జారీ చేసింది. మేధావుల గొంతు నొక్కే ప్రయత్నాలను గట్టిగా అడ్డుకుంటామని ఈ సందర్భంగా కవిత తన ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది.

Next Story