- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
sheep scam: గొర్రెల స్కామ్ లో తలసానికి బిగిస్తున్న ఉచ్చు.. అధికార పార్టీ ట్వీట్ తో రాజకీయ వర్గాల్లో చర్చ
గొర్రెల స్కామ్ లో తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఉచ్చుతప్పదా?

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో గొర్రెల స్కాం (Sheep Scam) రాజకీయంగా సంచలనం రేపుతోంది. గత బీఆర్ఎస్ (BRS) హాయంలో జరిగిన గొర్రెల పంపిణీ వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని తాజాగా ఎన్ ఫోర్స్ మెండ్ డైరెక్టరేట్ (ED) గుర్తించింది. దాదాపు రూ. వెయ్యి కోట్లకుపైగా స్కాం జరిగినట్లు నిన్న ఈడీ ప్రకటించింది. ఈ స్కామ్ లో దూకుడు పెంచిన ఈడీ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Thalasani Srinivas Yadav) మాజీ ఓఎస్డీ కల్యాణ్ ను అదుపులోకి తీసుకుంది. గత బుధవారం కల్యాణ్ ఇంటితోపాటు మరో ఎనిమిది ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో ఈడీ కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు శుక్రవారం ప్రకటించింది. అయితే దర్యాప్తులో భాగంగా ఈ కుంభకోణంలో రూ. వెయ్యి కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు ఈడీ ఆధారాలు సేకరించింది. కుంభకోణం విలువ అంతకంతకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ కేసులో మాజీ మంత్రి తలసాని పేరు సైతం మరోసారి తెరపైకి రావడం సంచలనంగా మారుతోంది. దీంతో ఈ కేసులో తలసానికి సైతం ఉచ్చుబిగిసుకోబోతున్నదా అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది.
టీ కాంగ్రెస్ ట్వీట్:
ఈ కేసులో ఇప్పటికే స్పీడ్ పెంచిన ఈడీ గొర్రెల పంపిణీలో అవినీతికి పాల్పడ్డ వారి కోసం వేట కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో చేసిన ట్వీట్ పొలిటికల్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ స్కామ్ వెనుక ఒక మేక వన్నె పులి ఉందట. అది ఎవరో మీకైమైనా తెలుసా అంటూ ఓ కార్టూన్ ను పోస్టు చేసింది. గొర్రెల స్కామ్ కేసులో త్వరలో తలసాని సైతం అరెస్టు అవతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో అధికార పార్టీ తలసాని పోలిన కార్టూన్ ను పోస్టు చేయడంతో తలసాని విషయంలో ఏం జరగబోతున్నది అనేది సస్పెన్స్ గా మారింది. అయితే మాజీ పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు త్వరలోనే ఈడీ సమన్లు జారీ చేసే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.






