గిరిజన యువతకు 'ట్రైకార్' బాసట..రూ.2,546 కోట్లతో

by velandi.Saikiran |

రాష్ట్రంలోని గిరిజన యువత ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధి కల్పన లక్ష్యంగా తెలంగాణ షెడ్యూల్ తెగల ఆర్థిక సహకార సంస్థ (ట్రైకార్) కీలక నిర్ణయం తీసుకుంది.

గిరిజన యువతకు ట్రైకార్ బాసట..రూ.2,546 కోట్లతో
X

గిరిజన యువతకు 'ట్రైకార్' బాసట..

రూ.2,546 కోట్లతో వార్షిక ప్రణాళికకు ఆమోదం

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని గిరిజన యువత ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధి కల్పన లక్ష్యంగా తెలంగాణ షెడ్యూల్ తెగల ఆర్థిక సహకార సంస్థ (ట్రైకార్) కీలక నిర్ణయం తీసుకుంది. ట్రైకార్ ఛైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్ తేజావత్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన సంస్థ 11వ బోర్డు సమావేశంలో.. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2,546.24 కోట్ల భారీ వార్షిక ప్రణాళికను ఆమోదించారు. ఈ నిధులలో రూ.2,085 కోట్లు సబ్సిడీ రూపంలో, రూ.461.24 కోట్లు బ్యాంక్ రుణాల ద్వారా గిరిజన లబ్ధిదారులకు అందించనున్నారు. ఈ ప్రణాళిక ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,36,184 మంది గిరిజన యువతకు లబ్ధి చేకూరనుంది.

ఈ సమావేశంలో ఛైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ.. గిరిజనుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు అనేక వినూత్న పథకాలను ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. రాజీవ్ యువ వికాసం, ఆదిమ గిరిజనుల జీవనోపాధి అభివృద్ధి, రూరల్ ట్రాన్స్‌పోర్ట్ పథకం, గిరిజన రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ, సీఎం ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇన్నోవేషన్ స్కీమ్, ఇందిరా సౌర గిరి జల వికాసం, నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు, క్యూర్ ప్రాంతాల్లో ఆటో రిక్షాల రిట్రోఫిట్టింగ్ కోసం ఎలక్ట్రికల్ ఫిట్‌మెంట్ కల్పించడం వంటి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో ట్రైకార్ డైరెక్టర్, ఎక్స్ అఫీషియో మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్, ట్రైకార్ జీఎం శంకర్ రావు, ట్రైకార్ మేనేజర్ లక్ష్మీప్రసాద్, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

Next Story