- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మున్సిపల్ ఎన్నికల్లో ఈ మూడు పార్టీల మధ్యే పోటీ: సీఎం రేవంత్ రెడ్డి
మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ జరుగుతోందని అందువల్ల గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, భవిష్యత్ ను ఆలోచించుకుని తీర్పు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ 12 ఏళ్లుగా అధికారంలో ఉండగా గత పదేళ్లు రాష్ట్రంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉందన్నారు. ఈ 12 ఏళ్లలో బీజేపీ తెలంగాణకు ఏమైనా ప్రాజెక్టులు మంజూరు చేశారా అని ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డిని జాతీయ ప్రాజెక్టుగా చేస్తామనే మోడీనే స్వయంగా ప్రకటించారు. కానీ మోడీ మూడు సార్లు ప్రధాని అయిన ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, నిధులు ఇవ్వలేదన్నారు. ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలు మోడీని చూసి ఓటేయాలని అడుగుతున్నారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సైతం తెలంగాణను అవమానించేలా మాట్లాడి ఓట్లు మాత్రం బీజేపీకి ఓట్లు వేయాలని అడుగుతున్నారని విమర్శించారు.
వరదల్లో నీటమునిగిన వస్తులన్నీ తిరిగిస్తామని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బండి సంజయ్ హామీ ఇచ్చారు. బండి మునిగితే బండి, ఆటో మునిగితే ఆటో ఇస్తామని చెప్పారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చి వస్తువులన్నీ తిరిగిస్తామని ప్రకటించారు. బండి సంయ్ హామీలను నమ్మి జీహెచ్ఎంసీలో 50 మంది బీజేపీ కార్పొరేటర్లను గెలిపిస్తే ఎన్నికలయ్యాక అడిగితే వస్తువులకు ఇన్సూరెన్స్ ఉంటుందని బండి సంజయ్ మాటమార్చారని విమర్శించారు. ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చేదానికి బండి సంజయ్ రికమండేషన్ ఎందుకో అని ప్రశ్నించారు. బండి సంజయ్ మాలు సత్రం భోజనానికి పెద్దారెడ్డి రికమండేషన్ అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు.






