- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విచారణ తేదీ మార్పు.. గులాబీ బాస్ వ్యూహమేంటి?
కాళేశ్వరం కమిషన్విచారణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం కమిషన్విచారణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత అనుభవాల దృష్ట్యా ఆయన హాజరు కాకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 5న విచారణకు హాజరు కావాలని కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసు జారీ చేసింది. ఆ రోజున హాజరుకాలేనని, 11వ తేదీన హాజరవుతానని కమిషన్‌కు ఆయన తాజాగా లేఖ రాశారు. దీనిపై కమిషన్ సైతం సానుకూలంగా స్పందించింది. తేదీ మార్పు వెనక ఉద్దేశం ఏమిటీ? ప్రత్యేక వ్యూహం ఏమైనా ఉందా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. మరో వైపు గతంలో విద్యుత్కమిషన్విచారణకు సైతం బీఆర్ఎస్ అధినేత హాజరు కాలేదు. ఇప్పుడు సైతం ఆయన అటెండ్ అవుతారా.. లేదా అనే సందేహాలు వ్యక్తవుతున్నాయి.
ప్రశ్నలపై ప్రిపేర్ అయ్యేందుకేనా?
ఈ నెల 6న ఈటల రాజేందర్, 9న హరీశ్‌రావు కమిషన్ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. ఇరువురిని అడిగిన ప్రశ్నలనే కేసీఆర్‌ను సైతం అడిగే అవకాశం ఉన్నదని, ఈ నేపథ్యంలో కమిషన్ఏ కోణంలో, ఏ విధమైన ప్రశ్నలు అడగనున్నదో తెలుసుకొని ముందుగానే ప్రిపేర్ అయితే ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులూ రావని న్యాయవాదులు, నిపుణుల సూచన మేరకు కేసీఆర్ విచారణ వాయిదా వేసుకున్నట్టు తెలుస్తున్నది. మరి కొందరు మాత్రం కేసీఆర్11న సైతం వెళ్తారా..? లేక జూమ్‌ద్వారా హాజరవుతారా..? లేక రాతపూర్వకంగా ప్రశ్నలు పంపిస్తే సమాధానాలు ఇస్తానని ఏమైనా చెబుతారా? అనే కోణంలోనూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీటిపై కాళేశ్వరం కమిషన్ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.
4న ఇందిరా పార్క్ వద్ద కవిత నిరసన
కేసీఆర్‌కు కాళేశ్వరం కమీషన్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 4న ఇందిరా పార్క్‌వద్ద నిరసన తెలపనున్నట్లు ప్రకటించారు. అసలు కేసీఆర్‌కు నోటీసులు ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇచ్చినందుకు ఇస్తారా..? ప్రపంచంలోనే అతి పెద్దదైనా ఎత్తిపోతల పథకాన్ని అతి తక్కువ కాలంలో నిర్మించినందుకు ఇస్తారా? అని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఈ నోటీసులు తెలంగాణకు ఇచ్చినట్లుగానే భావించాల్సి ఉంటుందని కవిత ఇప్పటికే వెల్లడించారు. కేసీఆర్వాయిదా కోరడం, నోటీసులు ఇవ్వడానికి వ్యతిరేకంగా కవిత ధర్నా చేయడాన్ని పరిశీలిస్తే గులాబీ అధినేత విచారణకు హాజరుకావడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.






