మంత్రి పొంగులేటికి ట్రెసా కృతజ్ఞతలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-06 13:19:57  IST  )

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల తిరుగు బదిలీలు చేపట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది.

మంత్రి పొంగులేటికి ట్రెసా కృతజ్ఞతలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల తిరుగు బదిలీలు చేపట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది. శుక్రవారం ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు వంగా రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి బదిలీల విషయంలో ట్రెసా కృషిని అభినందిస్తూ బదిలీలు త్వరలోనే పూర్తవుతాయని, రెవెన్యూ ఉద్యోగులందరూ కొత్త చట్టం, రెవెన్యూ సదస్సుల నేపథ్యంలో ప్రజలకు మేలైన సర్వీసులు అందించాలని కోరినట్లు రవీందర్ రెడ్డి తెలిపారు. బదిలీల విషయంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపినందులకు ట్రెసా పక్షాన ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో ట్రెసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతం కుమార్, రాజ్‌కుమార్, రమన్ రెడ్డి, చక్రవర్తి, వకీల్, రామకృష్ణారెడ్డి ఉన్నారు.

Next Story