తహశీల్దార్లకు ప్రమోషన్లు ఇవ్వండి: మంత్రి పొంగులేటిని కోరిన ట్రెసా

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో సుదీర్ఘ కాలంగా తహశీల్దార్లుగా పని చేస్తున్న వారికి డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్లు కల్పించాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వంగా రవీందర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.

తహశీల్దార్లకు ప్రమోషన్లు ఇవ్వండి: మంత్రి పొంగులేటిని కోరిన ట్రెసా
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో సుదీర్ఘ కాలంగా తహశీల్దార్లుగా పని చేస్తున్న వారికి డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్లు కల్పించాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వంగా రవీందర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. చాలా కాలంగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారని వివరించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలోనే చర్చించి ప్రమోషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో ట్రెసా రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రాజ్‌కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు చక్రవర్తి, శ్రీనివాస్, దేశ్య, వాణి, నాగమణి, నిజామాబాద్ అధ్యక్షులు రమన్‌రెడ్డి, తహశీల్దార్లు రవీందర్, కనకయ్య, సదానందం, కుమార్, విజయ్‌సాగర్, ఇమ్రాన్ ఉన్నారు.

Next Story