Trending: తొలి మ్యాచ్‌లో ఓటమి.. బోరున ఏడ్చిన పాక్ ప్లేయర్ (వీడియో వైరల్)

by Kema Shiva Kumar |   (  Updated:2025-02-22 09:06:19  IST  )

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy-2025)లో భాగంగా న్యూజిలాండ్‌ (New Zealand)తో జరిగిన తొలి మ్యాచ్‌లో అతిథ్య జట్టు పాకిస్థాన్ (Pakistan) 60 పరుగుల తేడాతో ఘోరంగా ఓడింది.

Trending: తొలి మ్యాచ్‌లో ఓటమి.. బోరున ఏడ్చిన పాక్ ప్లేయర్ (వీడియో వైరల్)
X

దిశ, వెబ్‌డెస్క్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy-2025)లో భాగంగా న్యూజిలాండ్‌ (New Zealand)తో జరిగిన తొలి మ్యాచ్‌లో అతిథ్య జట్టు పాకిస్థాన్ (Pakistan) 60 పరుగుల తేడాతో ఘోరంగా ఓడింది. ఈ క్రమంలోనే ఆ జట్టు ఫకర్ జమాన్ (Fakhar Zaman) ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన విషయం అందరికీ తెలిసిందే. న్యూజిలాండ్ (New Zealand) ఓపెనర్ విల్ యంగ్ (Will Young) కొట్టిన బౌండరీని ఆపే క్రమంలో ఫకార్ జమాన్ (Fakhar Zaman) ఔట్ ఫీల్డ్‌లో కాలు జారి గాయపడ్డాడు. దీంతో అతడికి గజ్జల్లో గాయమైంది. గాయం తీవ్రంగా ఉండటంతో పెవీలియన్‌కే పరిమితం అయ్యాడు. అయితే, బ్యాటింగ్ చేసేందుకు అతడు ఓపెనర్‌లా కాకుండా మిడిలార్డర్‌లో వచ్చాడు. 41 బంతుల్లో 24 పరుగులు చేసి ధాటిగా ఆడే క్రమంలో క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో ఫకర్ జమాన్ (Fakhar Zaman) డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి కుర్చీలో కూర్చొని బోరున ఏడ్చాడు.

అక్కడే ఉన్న తోటి ఆటగాడు షాహిన్ ఆఫ్రిది (Shaheen Afridi), అసిస్టెంట్‌ కోచ్‌ (Assistant Coach)లు అతడిని ఓదార్చారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media)లో విపరీతంగా వైర్ అవుతోంది. ఫకర్ జమాన్ గాయం కారణంగా టోర్నీ మొత్తానిక దూరం కావడంతో అతని స్థానంలో ఇమామ్ ఉల్ హక్‌ (Imam Ul Haq)ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (PCB) రీప్లేస్ చేసింది. అసలే ఘోర ఓటమితో సతమతం అవుతోన్న పాక్ జట్టుకు ఫకర్ జమాన్ గాయం కారణంగా దూరం కావడం పెద్ద లాస్ అని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ (Cricket Experts) అంటున్నారు. భారత్‌ (India)తో జరిగే మ్యాచ్‌కు ముందు అనుభవం గల కీలక ఆటగాడు పాక్ జట్టులో లేకపోవడం ఆ టీమ్ బ్యాటింగ్ ఆర్డర్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.

Next Story