నిమ్స్‌లో కల్తీ కల్లు బాధితులకు చికిత్స.. హెల్త్ బులిటిన్ విడుదల

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-10 06:25:50  IST  )

హైదరాబాద్‌ (Hyderabad)లోని కూకట్‌పల్లిలో కల్తీ కల్లు సేవించిన ఘటనలో ఇప్పటి వరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. 31 మంది నిమ్స్ ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు.

నిమ్స్‌లో కల్తీ కల్లు బాధితులకు చికిత్స.. హెల్త్ బులిటిన్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ (Hyderabad)లోని కూకట్‌పల్లిలో కల్తీ కల్లు సేవించిన ఘటనలో ఇప్పటి వరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అదేవిధంగా 31 మంది నిమ్స్ ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే బాధితుల ఆరోగ్యంపై నిమ్స్ ఆసుపత్రి తాజాగా హెల్త్ బులిటిన్ (Health Bulletin) విడుదల చేసింది. ఆసుపత్రి కల్తీ కల్లు సేవించి మొత్తం 31 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. అందులో 27 మంది పరిస్థితి అదుపులో ఉందని తెలిపారు. మరో నలుగురికి డయాలసిస్ (Dialysis) ట్రిట్‌మెండ్ కొనసాగుతోందని వెల్లడించారు. మల్టీ స్పెషాలిటీ వైద్య నిపుణులు వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారని నిమ్స్ ఆసుపత్రి హెల్త్ బులిటిన్ విడుల చేసింది. కాగా, కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. వారిలో కలగళ్ల సీతారం, సీహెచ్ బొజ్జయ్య, చౌదరిమెట్టు స్వరూప, మౌనిక, నారాయణ, మరొకరు ఉన్నారు.

Next Story