- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Harish Rao: సెల్ ఫోన్ వెలుతురులో రోగులకు వైద్యం.. ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన.. హరీశ్‌రావు ట్వీట్
ప్రభుత్వ ఆసుపత్రిలో సాంకేతిక కారణంతో కరెంటు లేక సెల్ ఫోన్ లైట్ల (cell phone light) వెలుగులో రోగులకు వైద్యులు చికిత్స చేస్తున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: (Zaheerabad Government Hospital) జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సాంకేతిక కారణంతో కరెంటు లేక సెల్ ఫోన్ లైట్ల (cell phone light) వెలుగులో రోగులకు వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు తాజాగా నెట్టింట వైరల్‌గా మారాయి. పేద ప్రజలకు వైద్యం చేసే ప్రభుత్వ ఆసుపత్రులకు కూడా కరెంట్ సరఫరా చేయకపోవడం ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమని ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ ఘటనపై శనివారం మాజీ మంత్రి, బీఆర్ఎస్ లీడర్ హరీశ్‌రావు (Harish Rao) తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు.
ఒకవైపు (Power cuts) కరెంట్ కోతలు, మరోవైపు ఆసుపత్రిలో ఉన్న జనరేటర్ పని చేయదని, చివరకు సెల్ ఫోన్ లైట్ వెలుతురులో చికిత్స చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. 300 పైగా పేషెంట్లు వచ్చే జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పరిస్థితి ఇలా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఇతర ఆసుపత్రుల పరిస్థితి ఎలా ఉన్నట్లు.. అని ప్రశ్నించారు. ఏడాదిన్నరగా పాలన పడకేసిందని, పేదలకు వైద్యం అందకుండా పోతున్నదని ఆరోపించారు. గాలిలో మెడలు కట్టడం మానేసి, కనీస సౌకర్యాలు కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.






