ప్రైవేట్ ట్రావెల్స్‌పై రవాణా శాఖ అధికారుల కొరడా

by Ajay Maddhiboyina |

హైదరాబాద్ లోని రాజేంద్ర‌న‌గ‌ర్ లో ర‌వాణాశాఖ అధికారులు దాడులు నిర్వ‌హించారు. ప్రైవేట్ ట్రావెల్స్ బ‌స్సుల్లో అధికంగా డ‌బ్బులు వ‌సూలు చేస్తున్న‌ట్టు గుర్తించి ఐదు బ‌స్సుల‌పై కేసులు న‌మోదు చేశారు.

ప్రైవేట్ ట్రావెల్స్‌పై రవాణా శాఖ అధికారుల కొరడా
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్రైవేట్ ట్రావెల్స్ సంక్రాంతి పండుగ‌ను క్యాష్ చేసుకుంటున్నాయి. ప్ర‌యాణికుల అవ‌స‌రాన్ని ఆస‌రాగా తీసుకుని టికెట్ ధ‌ర‌లు భారీగా పెంచేశాయి. దీంతో హైదరాబాద్ లోని రాజేంద్ర‌న‌గ‌ర్ లో ర‌వాణాశాఖ అధికారులు దాడులు నిర్వ‌హించారు. ప్రైవేట్ ట్రావెల్స్ బ‌స్సుల్లో అధికంగా డ‌బ్బులు వ‌సూలు చేస్తున్న‌ట్టు గుర్తించి ఐదు బ‌స్సుల‌పై కేసులు న‌మోదు చేశారు. ప్ర‌స్తుతం సోదాలు కొన‌సాగుతున్నాయి. హైద‌రాబాద్ నుండి కేర‌ళ‌, బెంగళూరు, త‌మిళ‌నాడు, పాండిచ్చేరితో పాటు ఏపీకి వెళుతున్న బ‌స్సుల్లో అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు. ఇదిలా ఉంటే సంక్రాంతి, దస‌రా లాంటి పండుగ‌లు వ‌చ్చాయంటే ప్రైవేట్ ట్రావెల్స్ ధ‌ర‌ల‌ను భారీగా పెంచేస్తున్నాయి. పాత టికెట్ ధ‌ర‌ల‌పై అధికంగా 100 నుండి 200 వ‌సూలు చేస్తున్నాయి. కొన్నిసార్లు అంత‌కంటే ఎక్కువే వ‌సూలు చేస్తున్నాయి. దీంతో ఆక‌స్మిక ప్ర‌యాణం చేసే ప్ర‌యాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Next Story