ఇద్దరు హైకోర్టు జడ్జీల బదిలీ

by Muthe.Rajitha |

రాష్ట్ర హైకోర్టుకు చెందిన ఇద్దరు జడ్జీలను బదిలీ చేస్తు సుప్రీంకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇద్దరు హైకోర్టు జడ్జీల బదిలీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర హైకోర్టుకు చెందిన ఇద్దరు జడ్జీలను బదిలీ చేస్తు సుప్రీంకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ పెరుగు శ్రీసుధ ను కర్ణాటక కోర్టుకు, జస్టిస్ కాసోసు సురేందర్ ను మద్రాసు కోర్టుకు బదిలీ చేశారు. జస్టిస్ పెరుగు శ్రీసుధ 2021 నుంచి హైకోర్టులో 11 నెంబర్ కోర్టులో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జస్టిస్ కాసోసు సురేందర్ హైకోర్టులో 23 నెంబర్ కోర్టులో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 15 నుంచి19 వ తేది వరకు జరిగిన సుప్రీంకోర్టు కోలీజీయం సమావేశాలలో జడ్జీల బదిలీలకు సబంధించి సిఫార్సు చేశారు. కోలీజీయం సిఫార్సుతో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story