ISB: తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఐఎస్ బీలో శిక్షణ: భట్టి విక్రమార్క

by Prasad Jukanti |

ప్రపంచంతో పోటీ పడుతున్న తెలంగాణ అభివృద్ధి కోసం ఐఎస్ బీ విద్యార్థులు సహకరించాలని భట్టి విక్రమార్క కోరారు.

ISB: తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఐఎస్ బీలో శిక్షణ: భట్టి విక్రమార్క
X

దిశ, డైనమిక్ బ్యూరో: విద్యా రంగంపై రాష్ట్ర ప్రభుత్వం ఎవ్వరు ఊహించని రీతిలో పెట్టుబడులు పెడుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. విద్యపై పెట్టుబడి రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడుతుందని మా ప్రభుత్వం నమ్ముతోందన్నారు. ఇవాళ హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో మోతిలాల్ ఓస్వాల్ ఎగ్జిక్యూటివ్ సెంటర్ ను ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. కళాశాల విద్యను పూర్తి చేసుకుని బయటకు వెళ్లగానే విద్యార్థులు ఉద్యోగాలు పొందే విధంగా స్కిల్ యూనివర్సిటీలో సిలబస్ రూపొందించి అమలు చేస్తున్నట్టు తెలిపారు. పారిశ్రామిక వేత్తలతో మాట్లాడి స్కిల్ యూనివర్సిటీ సిలబస్ రూపొందిస్తామన్నారు. యువ రాష్ట్రమైన తెలంగాణ ప్రపంచంతో పోటీపడుతోందని, రాష్ట్ర అభివృద్ధి కోసం ఐఎస్ బీ (ISB) విద్యార్థులు సహకరరించాలని కోరారు. రాష్ట్ర విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను పూర్తిగా ఉచితంగా అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఐఎస్ బీలో 5 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం రూపొందించి అమలు చేయాలని నిర్వాహకులను భట్టి విక్రమార్క కోరారు. తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు.

Next Story