- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు శిక్షణ పూర్తి.. అన్ని హామీలను నెరవేరుస్తాం : మంత్రి సీతక్క
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో భాగంగా సర్పంచ్‌లు, వార్డు మెంబర్లకు వారి విధులు, నిర్వహణపై ఇప్పటికే శిక్షణ ఇచ్చామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో భాగంగా సర్పంచ్‌లు, వార్డు మెంబర్లకు వారి విధులు, నిర్వహణపై ఇప్పటికే శిక్షణ ఇచ్చామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. ప్రశ్నోత్తరాల సమయంలో మండలిలో సభ్యులు నవీన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. పారిశుద్ధ్య కార్మికులకు రెగ్యులర్‌గా జీతాలు అందేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. కారోబార్లు సుదీర్ఘ కాలంగా చేస్తున్న పోరాటం తమ దృష్టిలో ఉందని, వారి సమస్య ప్రస్తుతం పరిశీలనలో ఉందన్నారు. అన్ని హామీలను నెరవేరుస్తామన్నారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పారిశుద్ధ్య కార్మికులు ఎదుర్కొన్న ఇబ్బందులను ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. గత పాలనలో నెలల తరబడి పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారని, కారోబార్‌లకు, పారిశుద్ధ్య కార్మికులకు మధ్య వ్యత్యాసం లేకుండా చేసిందే బీఆర్‌ఎస్ ప్రభుత్వం అని ఆమె విమర్శించారు. ముఖ్యంగా జీవో 51 తీసుకువచ్చి కారోబార్లకు ఆ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు.






