- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంక్రాంతి తర్వాత సర్పంచులకు ట్రైనింగ్
తెలంగాణాలో ఇటీవలే గ్రామపంచాయితీ ఎన్నికలు జరిగి, కొత్త సర్పంచులు ఎన్నికైన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణాలో ఇటీవలే మూడు దశలుగా గ్రామపంచాయితీ ఎన్నికలు జరిగి, కొత్త సర్పంచులు ఎన్నికైన సంగతి తెలిసిందే. కాగా వీరందరికీ సంక్రాంతి తర్వాత ఇస్తామని ప్రాంచాయితీరాజ్ శాఖ పేర్కొంది. పల్లెల్లో పాలన, నిధుల వినియోగం, అభివృద్ధి, గ్రామసభల నిర్వహణ, పంచాయతీ చట్టాలు, బాధ్యతలు మరియు అధికారాలు వంటి అంశాలపై పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇవ్వనున్నారు. జిల్లాల వారీగా ఒక్కో బ్యాచ్ లో 50 నుంచి 100 మందికి శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12,000కు పైగా గ్రామ పంచాయతీలు ఉండటంతో ఈ శిక్షణ కార్యక్రమం దశలవారీగా జరగనుంది.
అయితే సర్పంచులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అనంతరమే ఈ ట్రైనింగ్ ఉంటుందని పంచాయితీరాజ్ అధికారులు స్పష్టం చేసారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు పాలనలో సమర్థవంతంగా పనిచేయడానికి ఈ శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. గ్రామీణాభివృద్ధి మరింత మెరుగుపడేందుకు ఈ చొరవ కీలకమని అభిప్రాయపడుతున్నారు.






