గవర్నర్‌ను కలిసిన ట్రైనీ ఐపీఎస్‌లు.. అభినందించిన జిష్ణుదేవ్ వర్మ

by Ramesh Naini |

రాష్ట్ర పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 77వ ఆర్ఆర్ బ్యాచ్‌కు చెందిన ప్రొబెషనరీ ఐపీఎస్‌లు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు.

గవర్నర్‌ను కలిసిన ట్రైనీ ఐపీఎస్‌లు.. అభినందించిన జిష్ణుదేవ్ వర్మ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 77వ ఆర్ఆర్ బ్యాచ్‌కు చెందిన ప్రొబెషనరీ ఐపీఎస్‌లు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రానికి కేటాయించిన నలుగురు ట్రైనీ ఐపీఎస్‌లు శనివారం హైదరాబాద్‌లోని రాజ్ భవన్‌లో గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఈ బృందంతో పాటు పోలీస్ అకాడమీ డైరెక్టర్ జనరల్ అభిలాషా బిస్త్ ఉన్నారు. వారి నేతృత్వంలో ఐపీఎస్‌లు శిక్షణలో ఉన్నారు. ఈ సందర్భంగా శిక్షణా కార్యక్రమాలు, ఫీల్డ్ ఎక్స్‌పోజర్ గురించి గవర్నర్‌కు తెలియజేశారు. సమావేశంలో, సేవ బాధ్యతకు అంకితమైన వృత్తిని ఎంచుకున్నందుకు ప్రొబేషనర్లను గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు. రాజ్యాంగ విలువలను నిలబెట్టడంలో, ప్రజా భద్రతను నిర్ధారించడంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఇండియన్ పోలీస్ సర్వీస్ కీలక పాత్రను వారికి గవర్నర్ వివరించారు. అంకితభావంతో, విధులను నిర్వర్తించాలని వారిని గవర్నర్ ప్రోత్సహించారు.

Next Story