Stray Dogs: వరంగల్ జిల్లాలో విషాదకరమైన ఘటన.. 7 ఏళ్ల బాలికపై వీధి కుక్కల దాడి

by Ramesh Naini |

వరంగల్ జిల్లా కేంద్రంలోని న్యూశాయంపేటలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.

Stray Dogs: వరంగల్ జిల్లాలో విషాదకరమైన ఘటన.. 7 ఏళ్ల బాలికపై వీధి కుక్కల దాడి
X

దిశ, డైనమిక్ బ్యూరో: వరంగల్ (Warangal) జిల్లా కేంద్రంలోని న్యూశాయంపేటలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న 7 ఏళ్ల శ్రీజ అనే బాలికపై వీధి కుక్కలు (stray dogs) మూకుమ్మడి దాడి చేశాయి. ఈ ఘటనకు సంబంధించిన సీసీ కెమెరాల్లో రికార్డు తాజాగా సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. అయితే, బాలికపై దాదాపు 7 నుంచి 8 వీధి కుక్కలు దాడికి దిగాయి. ఇది గమనించి స్థానికులు వాటిని తరమడంతో బాలికకు ప్రాణాపాయం తప్పినట్లైంది. ఇక, గాయాలపాలైన శ్రీజను చికిత్స నిమిత్తం వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధి కుక్కల బెడద పెరిగిపోతున్నా మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రతి దాడి తర్వాత నామమాత్ర చర్యలు తీసుకొని, తర్వాత అసలు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఈ ఘటన శనివారం ఉదయం జరిగినట్లుగా సీసీ టీవీ ఫుటేజ్‌లో కన్పిస్తోంది. వీడియో ఇదే..

Next Story