విషాదం.. కారు డోర్ తగిలి రెండేళ్ల చిన్నారి..

by Disha Web Desk 4 |
విషాదం.. కారు డోర్ తగిలి రెండేళ్ల చిన్నారి..
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ ఎల్బీ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి నిర్లక్ష్యం ఓ చిన్నారి పాలిట శాపంగా మారింది. ఈ ప్రమాదంలో తల్లి కండిషన్ సైతం సీరియస్‌గా ఉంది. మన్సురాబాద్ నుంచి ఎల్బీ‌నగర్ రూట్‌లో రోడ్డు పక్కన ఓ వ్యక్తి కారు నిలిపి ఉంచాడు. సడెన్‌గా కారు డోర్ తీశాడు. అయితే పక్క నుంచి వెళ్తున్న బైక్‌కు కార్ డోర్ తగిలింది. ఈ ప్రమాదంలో బైక్ మీద వెళ్తున్న ఫ్యామిలీ కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి ధనలక్ష్మీ స్పాట్‌లోనే చనిపోయింది. ఇది గమనించిన డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. తల్లి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.


Next Story

Most Viewed