- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్, మేడ్చల్‌లో దారుణాలు.. పిల్లల్ని చంపిన తల్లి, తండ్రి
by Naga Rani Yarlagadda |
మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. పిల్లలతో కలిసి నారపల్లి చెరువులోకి దూకి ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడింది.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలో వరుస దారుణ ఘటనలు చోటుచేసుకున్నాయి. గోల్కొండలో భార్యతో జరిగిన గొడవలో.. ఓ భర్త తమ 14 నెలల పసికందు గొంతుకోసి దారుణంగా హతమార్చాడు. స్థానికంగా వాచ్ మన్ గా పనిచేస్తున్న నేపాల్ వాసి జగత్ భార్యతో గొడవపడ్డాడు. ఆ కోపంతో తమ బిడ్డ గొంతుకోసి చంపడం స్థానికంగా కలకలం రేపింది. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు జగత్ ను అరెస్ట్ చేసి, చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు పంపారు.
మేడిపల్లిలో విషాదం..
మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. పిల్లలతో కలిసి నారపల్లి చెరువులోకి దూకి ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో తల్లి (34), కుమార్తె (6) మృతి చెందగా.. మరో ఇద్దరు కుమార్తెల పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
Next Story






