Traffic Jam: సంక్రాంతి పండుగ ఎఫెక్ట్.. టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జాం

by Kema Shiva Kumar |

సంక్రాంతి (Sankranthi) పండుగ సందర్భంగా బతుకుదెరువు కోసం పట్టణాలకు వలస వచ్చిన వారంతా పల్లెలకు చేరుకుంటున్నారు.

Traffic Jam: సంక్రాంతి పండుగ ఎఫెక్ట్.. టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జాం
X

దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి (Sankranthi) పండుగ సందర్భంగా బతుకుదెరువు కోసం పట్టణాలకు వలస వచ్చిన వారంతా పల్లెలకు చేరుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది వారి స్వగ్రామాలకు చేరుకోగా.. మరికొందరు పల్లెలకు పయనమ్యారు. పండుగ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు ఈ నెల 11 నుంచి 19 వరకు సెలవులు ప్రకటించాయి. తిరిగి జనవరి 20న తరగతులు పునః ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే పాఠశాలలు, వసతి గృహాల్లో చదువుకుంటోన్న విద్యార్థులు తమ ఊళ్లకు వెళ్లేందుకు బస్‌స్టేషన్‌, రైల్వే స్టేషన్లకు చేరుకున్నారు. రద్దీ కారణంగా బస్సులో సీట్లు లేకపోవడంతో నిలబడే ప్రయాణం చేస్తున్నారు. హైదరాబాద్ (Hyderabad) నగర పరిధిలోని ప్రధాన బస్ స్టాప్‌ల వద్ద జనం బస్సుల కోసం నిరీక్షించారు. బస్సులు రాగానే తమ గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవాలనే ఆత్రుతతో సీట్ల కోసం పరుగులు పెడుతున్నారు.

మరోవైపు చాలామంది సొంత వాహనాలు ఉన్న వారు కుటుంబంతో సహా కార్లు, మోటర్ సైకిళ్ల మీద వారి గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ (Hyderabad)- విజయవాడ (Vijayawada) జాతీయ రహదారిపై చౌటుప్పల్ (Choutuppal) మండల పరిధిలోని పంతంగి (Panthangi), కేతేపల్లి (Kethepally) మండల పరిధిలోని కొర్లపహాడ్ (Korlapahad) టోల్ ప్లాజా (Tool Plaza)ల వద్ద భారీగా ట్రాఫిక్ జాం (Traffic Jam) అయింది. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులు, నేషనల్ హైవే అథారిటీ ఫోర్స్ (National Highway Authority Force) రంగంలోకి దిగింది. అదేవిధంగా నగరంలోని అమీర్‌పేట్ (Ameerpet), కూకట్‌పల్లి (Kukatpally)లో భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్లుగా తెలుస్తోంది.

Next Story