- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
న్యూ ఇయర్ వేడుకలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి: ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే
న్యూ ఇయర్ వేడుకలపై ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూ ఇయర్ వేడుకలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: న్యూ ఇయర్ వేడుకలపై ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూ ఇయర్ వేడుకలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అన్నారు. టికెటెడ్ ఈవెంట్ నిర్వహిస్తే ముందుగానే అనుమతి తీసుకోవాలని చెప్పారు. ఎంతమంది వస్తున్నారు.. ఎన్ని టికెట్లు అమ్ముతున్నారో నిర్వాహకులు సమాచారం ఇవ్వాలన్నారు. పార్కింగ్ ఎలా ఉందో కూడా చెప్పాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవన్నారు. ఏవైనా ప్రమాదాలు జరిగితే ఈవెంట్ నిర్వాహకులదే బాధ్యత అని హెచ్చరించారు.
15 రోజుల ముందుగానే అనుమతి కోసం అప్లై చేసుకోవాలన్నారు. ఈవెంట్ నిర్వహించే రోజు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొందరు సరైన పార్కింగ్ సదుపాయం లేకున్నా ఎక్కువమందిని ఈవెంట్ కు తీసుకువస్తారని దాని వల్ల రోడ్డుపై వాహనాలు పెడతారని చెప్పారు. డ్రంక్ అండ్ అండ్ డ్రైవ్ తగ్గించేందుకు తాగి వెళుతున్నవాళ్ల కోసం డ్రైవర్లను ఏర్పాటు చేయాలన్నారు. వాహనదారులు కూడా తాగి నడిపితే కఠిన చర్యలు తసుకుంటామని, రోడ్డుపై స్టంట్స్ చేస్తే ఊరుకునేదిలేదన్నారు. న్యూయర్ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ చెకప్ స్టేషన్లు కూడా పెంచుతామన్నారు.






