- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ మధ్య రాకపోకలు బంద్
గోదావరి నదికి వరద భారీగా ఉధృతి పెరిగింది.

దిశ, వెబ్ డెస్క్ : గోదావరి నదికి వరద భారీగా ఉధృతి పెరిగింది. ములుగు జిల్లాలో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలోని వాజేడు మండలంలోని పేరూరు దగ్గర వరద స్థాయి 15.83 మీటర్లకు చేరగా మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసారు అధికారులు. టేకులగూడెం వద్ద 163 జాతీయ రహదారిపై వరద నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి. రెగుమాగు వాగు వద్ద టేకులగూడెం బస్సు స్టాండ్ సమీపంలోని లో-లెవెల్ బ్రిడ్జి నీట మునిగింది.
దీంతో ములుగు ఎస్పీ డాక్టర్ పి. షబరీష్ ఆ బ్రిడ్జిని మూసివేయాలని ఆదేశించారు. భద్రత కోసం బారికేడ్లు ఏర్పాటు చేసి, ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. గత నాలుగు రోజుల నుంచి మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లోని గోదావరి ఎగువ పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో నదిలో భారీగా వరద నీరు చేరుతోంది. మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 32.8 అడుగులకు చేరింది.






