TPCC : టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం వాయిదా

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-21 08:53:31  IST  )

గాంధీభవన్ లో ఈ నెల 23వ తేదీన జరుగాల్సిన తెలంగాణ పీసీసీ(TPCC) విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం(Broad-based executive meeting) వాయిదా (postponed)పడింది.

TPCC : టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్ : గాంధీభవన్ లో ఈ నెల 23వ తేదీన జరుగాల్సిన తెలంగాణ పీసీసీ(TPCC) విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం(Broad-based executive meeting) వాయిదా (postponed)పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో శనివారం నిర్వహించాలనుకున్న టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని వాయిదా వేయాలని నిర్ణయించినట్లుగా పీసీసీ వెల్లడించింది. 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యాక తిరిగి ఈ సమావేశాన్ని ఎప్పుడు నిర్వహిస్తామన్నదానిపై కొత్త తేదీని ప్రకటిస్తామని టీపీసీసీ పేర్కొంది.

రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జిగా దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్ నియామితులైన తర్వాత నిర్వహించనున్న టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం పార్టీ పరంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కులగణన సర్వే నివేదిక, బీసీ రిజర్వేషన్లు, అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టనుండటం, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, పార్టీ సంస్థాగత నిర్మాణం, కాంగ్రెస్ ఎన్నికల హామీలు వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించాల్సి ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు నిమిత్తం ముఖ్య నాయకులంతా ప్రచార బాధ్యతల్లో ఉన్న నేపథ్యంలో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కాగా విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం వాయిదా నేపథ్యంలో శుక్రవారం పీసీసీ చీఫ్ బి.మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రె్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, శ్రీధర్ బాబు, కొడా సురేఖ, జూపల్లి కృష్ణారావులు ఎమ్మెల్సీ ఎన్నికల పరిధిలోని 42అసెంబ్లీ నియోజకవర్గా ఇంచార్జిలు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ జూమ్ మీటింగ్ లో వారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు వ్యూహాలపై మార్గదర్శకం చేశారు.

Next Story