- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీపీసీసీ ఎస్సీ సెల్ నూతన కమిటీ నియామకం
టీపీసీసీ ఎస్సీ సెల్ నూతన కార్యవర్గాన్ని చైర్మన్, మాన కొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రకటించారు. ఎస్సీ సెల్ కార్యవర్గంలో 27 జిల్లాలకు అధ్యక్షులను ఆయన నియమించారు.

- జాబితాను ప్రకటించిన ఎస్సీ సెల్ చైర్మన్, మాన కొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
- 27 జిల్లాలకు నూతన అధ్యక్షులు
- రాష్ట్ర కమిటీలో వైస్ చైర్మన్లు 16 మంది, జనరల్ సెక్రటీరీలు 9, సెక్రటరీలు 29 మంది
దిశ, తెలంగాణ బ్యూరో : టీపీసీసీ ఎస్సీ సెల్ నూతన కార్యవర్గాన్ని చైర్మన్, మాన కొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రకటించారు. ఎస్సీ సెల్ కార్యవర్గంలో 27 జిల్లాలకు అధ్యక్షులను ఆయన నియమించారు. ఈ మేరకు శుక్రవారం కవ్వంపల్లి సత్యనారాయణ పాత కమిటీలు రద్దు చేసి, నూతన కార్యవర్గాన్ని నియమిస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, 6 జిల్లాల కార్యవర్గాలను ప్రకటించాల్సి ఉందని కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. రాష్ట్ర కార్యవర్గంలో వైస్ చైర్మన్లు 16 మంది, జనరల్ సెక్రటరీలు 9 మంది, సెక్రటరీలు 29 మంది, ఇద్దరు అధికార ప్రతినిధులతో కూడిన జాబితాను ఆయన విడుదల చేశారు. ఈ నియామకాల్లో యువతకు, ఉన్నత విద్యావంతులకు, పీహెచ్డీ పరిశోధకులు, డాక్టరేట్ పొందిన పలువురు విద్యావంతులకు ప్రత్యేక ప్రాధాన్యతను కల్పించి బాధ్యతలను అప్పగించినట్లుగా కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. గ్రామ స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర నాయకత్వం వరకు ప్రతి ఒక్కరిని ఒకే వేదిక పైకి తీసుకొచ్చి రాజకీయ అవగాహాన,రాజ్యాంగ విలువలు, పార్టీ సిద్దాంతాలు, సోషల్ మీడియా వినియోగం, ప్రజా సమస్యలపైన స్పందించే విధానాలపైన ప్రత్యేక శిక్షణ ఇస్తామని ఆయన చెప్పారు. దళితులు 54 కులాలకు అందరికీ ప్రాధాన్యత ఇచ్చామని, రాహుల్ గాంధీని ప్రధాని చేయడంలో ఎస్సీలు కీలకం కావాలని ఆయన పిలుపు ఇచ్చారు. ప్రతి జిల్లాలో ఎస్సీ సెల్ కమిటీలు ఉంటాయన్నారు.






