- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'ఎవనిపాలయ్యిందిరో తెలంగాణ'
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దసరా రోజున జాతీయ పార్టీ ప్రకటన చేయనున్న కేసీఆర్..

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దసరా రోజున జాతీయ పార్టీ ప్రకటన చేయనున్న కేసీఆర్.. ఆ పార్టీ అధినేతగా దేశవ్యాప్త పర్యటనల కోసం రూ.100 కోట్లు ఖర్చు చేసి ప్రత్యేక విమానం కొనుగోలు చేస్తున్నారు. అయితే, దీనిపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఏపూరి సోమన్న పాటను ట్విట్టర్‌లో జోడిస్తూ విమర్శించారు. ''అమరవీరుల కుటుంబాలను కలిసింది లేదు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఏనాడు పరామర్శించ లేదు. ప్రగతి భవన్ ఏసీ గదిని వీడింది లేదు.. ఫాంహౌస్ దాటింది లేదు. ఇప్పుడు దేశదిమ్మరిలా తిరగడానికి విమానం కొంటున్నాడట! ఎవనిపాలయ్యిందిరో తెలంగాణ..!!'' అంటూ టీఆర్ఎస్ పాలనపై ఆసక్తికర వ్యాఖ్యలు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
అమరవీరుల కుటుంబాలను కలిసింది లేదు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఏ నాడు పరామర్శించ లేదు.
— Revanth Reddy (@revanth_anumula) September 30, 2022
ప్రగతి భవన్ ఏసీ గదిని వీడింది లేదు... ఫాంహౌస్ దాటింది లేదు.
ఇప్పుడు దేశదిమ్మరిలా తిరగడానికి విమానం కొంటున్నాడట! ఎవనిపాలయ్యిందిరో తెలంగాణ...!! pic.twitter.com/rz4RIvlbfo






