టీవీ రంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటోంది.. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కీలక హామీ

by Ramesh Naini |

బేగంపేట టూరిజం ప్లాజా ప్రాంగణంలో తెలంగాణ టెలివిజన్ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన సినీ కార్మికుల కార్తీక మాస ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది.

టీవీ రంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటోంది.. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కీలక హామీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: బేగంపేట టూరిజం ప్లాజా ప్రాంగణంలో తెలంగాణ టెలివిజన్ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన సినీ కార్మికుల కార్తీక మాస ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు. సమ్మేళనంలో మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి, సినీ పరిశ్రమకు చెందిన 38 సంఘాల ప్రతినిధులు, పలువురు ప్రముఖ నటులు, సాంకేతిక నిపుణులు, సినీ కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీ కార్మికుల సంక్షేమం, సమస్యల పరిష్కారం, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అందరిదీ.. సినీ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు. సినీ పరిశ్రమలో సక్సెస్ రేట్ తక్కువ అని, రాజకీయాలు కూడా అంతేనని, రెండు రంగాలకూ పట్టుదల అవసరం అని కీలక వ్యాఖ్యలు చేశారు.

చదువుకుంటే జీవితం కలర్ టీవీలా మెరిసిపోతుంది.. ప్రభుత్వం టీవీ రంగం అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. జూబ్లీ హిల్స్ అభివృద్ధి చెందాలంటే నవీన్ యాదవ్ గెలవాల్సిన అవసరం ఉందని, కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ప్రజలకు ఎల్లవేళల అందుబాటులో ఉంటాడని టికెట్ ఇచ్చిందని తెలిపారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ ఖజానాను కొల్లగొట్టిందని, వాటాల తేడా వల్ల కవిత రోడ్డున పడ్డారని మండిపడ్డారు. టీవీ రంగాన్ని ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని, సినీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి చెప్పారు.

Next Story