TPCC President: మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసిన ఎమిగోస్ విద్యా సంస్థల చైర్మన్

by Ramesh Goud |

ఎమిగోస్ విద్యాసంస్థల అధినేత మూస్కు రమణా రెడ్డి(Moosku Ramana Reddy) టీపీసీసీ అధ్యక్షుడు(TPCC President) మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) ను కలిశారు.

TPCC President: మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసిన ఎమిగోస్ విద్యా సంస్థల చైర్మన్
X

దిశ, వెబ్ డెస్క్: ఎమిగోస్ విద్యాసంస్థల అధినేత మూస్కు రమణా రెడ్డి(Moosku Ramana Reddy) టీపీసీసీ అధ్యక్షుడు(TPCC President) మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) ను కలిశారు. తెలంగాణలో కొద్ది రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారం పార్టీ నుంచి ఎమ్మెల్సీ టికెట్ల కోసం రాష్ట్ర కాంగ్రెస్ పెద్దల చుట్టూ ఆశావాహులు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ స్థానం మాకే కేటాయించాలని వినతులు చేసుకుంటున్నారు. అంతేగాక కాంగ్రెస్ లోని ఇతర పెద్దల నుంచి ఫైరవీలు సైతం చేయించుకుంటున్నారు. ఈ క్రమంలోనే పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ ను ఎమిగోస్ విద్యా సంస్థల(Amigos Educational Institutions) చైర్మన్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ కు శాలువా కప్పి సత్కరించారు. అనంతరం ఆయనతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ నుండి రానున్న పట్ట భద్రుల నియోజవర్గం నుండి ఎమ్మెల్సీ గా పోటీ చేసేందుకు తనకు అవకాశం కల్పించాలని మూస్కు రమణ రెడ్డి కాంగ్రెస్ చీఫ్ ను కోరారు. దీంతో ఈ సమావేశం రాజకీయాల్లో చర్చానీయాంశంగా మారింది.

Next Story