- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గోపీనాథ్ కింది స్థాయి నుండి ఎదిగారు.. గోపీనాథ్ మృతి పట్ల టీపీసీసీ సంతాపం
by Gantepaka Srikanth |
సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(Maganti Gopinath) మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(Maganti Gopinath) మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం తనను తీవ్ర ద్రిగ్బాంతికి గురి చేసిందని అన్నారు. గోపీనాథ్ కింది స్థాయి నుండి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా ప్రజా నాయకుడిగా మంచి గుర్తింపు తెచుకున్నారని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన కుటుంబానికి తన సానుభూతి తెలిపారు. కాగా, 1982లో టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన మాగంటి.. 1985లో హైదరాబాద్ నగర తెలుగు యువత అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. 2014లో తొలిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2018లో, 2023లో బీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు.
Next Story






