పటాన్​చెరు ఘటనపై టీపీసీసీ సీరియస్

by Gantepaka Srikanth |

పఠాన్​చెరు నియోజకవర్గ కాంగ్రెస్​పార్టీలో వర్గ విభేదాలపై పీసీసీ సీరియస్ అయింది. ఇప్పటివరకు అంతర్గత ఉన్న విభేదాలు రోడ్డెక్కడంపై పార్టీ పెద్దలు సీరియస్​అయ్యారు.

పటాన్​చెరు ఘటనపై టీపీసీసీ సీరియస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పఠాన్​చెరు నియోజకవర్గ కాంగ్రెస్​పార్టీలో వర్గ విభేదాలపై పీసీసీ సీరియస్ అయింది. ఇప్పటివరకు అంతర్గత ఉన్న విభేదాలు రోడ్డెక్కడంపై పార్టీ పెద్దలు సీరియస్​అయ్యారు. ఈ అంశంపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీని పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్​గౌడ్​నియమించారు. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్​రెడ్డి క్యాంప్ ఆఫీస్‌పై నియోజవర్గ కాంగ్రెస్​ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్​గౌడ్​వర్గీయుల దాడితో ఇరువర్గాల మధ్య విభేదాలు బయటపడ్డాయి.

ఈ చర్యతో పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తడంతో పఠాన్​చెరు కాంగ్రెస్​పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అధిష్ఠానం చాలా సీరియస్​అయింది. ఈ మేరకు గురువారం టీపీసీసీ ఛీప్​మహేశ్​కుమార్​గౌడ్​లేఖ ద్వారా విచారణకు కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ విప్​ఆది శ్రీనివాస్, టీపీసీసీ వైస్​ప్రెసిడెంట్​ఎంఆర్‌జీ వినోద్​రెడ్డిలను కమిటీ సభ్యులుగా నియమించించారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందజేయాలని సూచించారు.

Next Story