అన్ని నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ పైన నేతలు అప్రమత్తంగా ఉండాలి : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

by Naga Rani Yarlagadda |

బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకాలు, మండల కమిటీలు, ఎస్ఐఆర్ ప్రక్రియపైన చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జూమ్ సమావేశాలను నిర్వహించింది.

అన్ని నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ పైన నేతలు అప్రమత్తంగా ఉండాలి : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకాలు, మండల కమిటీలు, ఎస్ఐఆర్ ప్రక్రియపైన చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జూమ్ సమావేశాలను నిర్వహించింది. శనివారం జరిగిన ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజక వర్గ ఇంచార్జ్ లు, కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు. ప్రధానంగా బీఎల్ఏల నియామకాలపైన చర్చ జరిగినట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయ. ఈ జూమ్ సమావేశం సుదీర్ఘంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నిర్వహించారు. ప్రతి పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ పైన నేతలు అప్రమత్తంగా ఉండాలని టీపీసీసీ చీఫ్ సూచించారు. ప్రతి నియోజకవర్గంలోనీ అన్ని గ్రామాల్లో బీఎల్ఏల నియామకం పూర్తి చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నియోజకవర్గంలో నూతన మండల అధ్యక్షుల నియామకం చేపట్టాలని, మండల కమిటీలను పూర్తి చేయాలని మహేష్​కుమార్ గౌడ్ ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో బీఎల్ఏల పేర్లు డీసీసీల ద్వారా కలెక్టర్ లకు చేరాలని టీపీసీసీ చీఫ్​నేతలకు సూచించారు.

టీపీసీసీ చీఫ్ తో జరిగిన జూమ్ మీటింగ్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో ఆయన జిల్లా ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ పైన, ఓటరు జాబితా సవరణపై నేతలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ లు దిశా నిర్దేశం చేశారు. కాగా, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో పార్టీ సంస్థాగత అభివృద్ధిపై చేయాల్సిన కార్యక్రమాలపై నేతలతో మంత్రి పొన్నం చర్చించారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో డీసీసీ అధ్యక్షులు మండలాల వారిగా పార్టీ సమావేశాలు ఏర్పాటు చేయాలని, ఎస్ఐఆర్ పైన నియోజకవర్గ ఇంచార్జి లు, కోఆర్డినేటర్ లు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. పార్టీలో ముందు నుండి క్రియాశీలంగా

Next Story