- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TPCC: ఆ నైతిక హక్కు హరీష్ రావుకి లేదు.. టీపీసీసీ అధికార ప్రతినిధి హాట్ కామెంట్స్
రేషన్ కార్డుల(BRS Cards) గురించి మాట్లాడే నైతిక హక్కు హరీష్ రావు(Harish Rao) కి లేదని టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం(TPCC General Secretary Sathyam Srirangam) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: రేషన్ కార్డుల(BRS Cards) గురించి మాట్లాడే నైతిక హక్కు హరీష్ రావు(Harish Rao) కి లేదని టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం(TPCC General Secretary Sathyam Srirangam) అన్నారు. ప్రెస్ మీట్ లో హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. బీఆర్ఎస్ నాయకులపై(BRS Leaders) హాట్ కామెంట్స్ చేశారు. సిద్దిపేటలో హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. సిద్దిపేట జిల్లా(Siddipeta District)లో లక్షా 90 వేల మంది ఇందిరమ్మ ఇళ్ల(Indiramma Houses) కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నాడని, అసలు అడిగే హక్కు ఆయనకు ఎక్కడిదని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో, రేషన్ కార్డుల విషయంలో ఉద్యోగాల విషయంలో రైతుల విషయంలో ప్రజల తరుపున మాట్లాడే నైతిక హక్కు హరీష్ రావు, కేసీఆర్(KCR), కేటీఆర్(KTR) లకు లేదని అన్నారు.
పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారని ప్రశ్నించారు. రేషన్ కార్డుల విషయంలో ఆదాయం పెంచామని హరీష్ రావు మాట్లాడుతున్నాడని, ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకుండా ఆదాయం పెంచి ప్రయోజనం ఏంటని నిలదీశారు. నిరుపేద కుటుంబాలకు, అర్హుడైన ప్రతీ వ్యక్తికీ రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) తీసుకుంటుందని శనివారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) చెప్పారని గుర్తు చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని, ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, రుణమాఫీ చేయలేదని, ఉద్యోగాలు కల్పించలేదని, పైగా ఇందిరమ్మ ఇళ్లు ఏవి అని అడగడానికి సిగ్గుండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక పదేళ్లలో ఎన్ని డబుల్ బెడ్ రూంలు ఇచ్చారో చెప్పండి అని నిలదీశారు. హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడే మాటలను ప్రజలు చీదరించుకుంటున్నారని, పదేళ్లు చేసిన పనులు చూపి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇక రేషన్ కార్డులు, రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదని కాంగ్రెస్ నేత అన్నారు.






