ముగిసిన టీ పీసీసీ ఎన్నికల, స్క్రీనింగ్ కమిటీ భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే

by Dishafeatures2 |
ముగిసిన టీ పీసీసీ ఎన్నికల, స్క్రీనింగ్ కమిటీ భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే సోమవారం గాంధీభవన్ లో టీ పీసీసీ ఎన్నికల, స్క్రీనింగ్ కమిటీ భేటీ అయ్యింది. అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన పలు విషయాలను భేటీలో చర్చించినట్లు తెలిసింది. ఇక స్క్రీనింగ్ కమిటీ భేటీ తర్వాత సీఈసీకి తొలి జాబితా పంపనున్నారు. సెప్టెంబర్ లో అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేయనున్నట్లు టీపీసీసీ ముఖ్య నేతలు తెలిపారు. సెప్టెంబర్ మొదటివారంలో మరోసారి ఎన్నికల కమిటీ భేటీ కానుందని తెలిపారు. ఈ భేటీలో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్, ఎంపీ కె.మురళీధరన్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed