కవిత పార్టీపై టీపీసీసీ చీఫ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

వాటాల పంపకాల్లో తలెత్తిన విభేదాల నుండే కవిత పార్టీ పుట్టింది. కూతురు పెట్టిన కుంపటితోనే కేసీఆర్ బయటకు వస్తున్నారు అని ఆయన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు.

కవిత పార్టీపై టీపీసీసీ చీఫ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: వాటాల పంపకాల్లో తలెత్తిన విభేదాల నుండే కవిత పార్టీ పుట్టింది. కూతురు పెట్టిన కుంపటితోనే కేసీఆర్ బయటకు వస్తున్నారు అని ఆయన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్ కేవలం తన ఉనికిని కాపాడుకునే పనిలో పడిందని విమర్శించారు. శుక్రవారం గాంధీ భవన్‌లో ఘనంగా జరిగిన మే డే వేడుకల్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కార్మిక వర్గానికి శుభాకాంక్షలు తెలుపుతూనే, బీఆర్‌ఎస్, బీజేపీ లక్ష్యంగా ఘాటైన విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్ ఆవిర్భావంపై మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనను ప్రశ్నిస్తూ మేము రెండున్నర ఏళ్లలోనే నాలుగున్నర లక్షల ఇళ్లు ఇచ్చాం. పదేళ్ల కాలంలో మీరు ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎన్ని?" అని నిలదీశారు. కవిత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం కేసీఆర్, కేటీఆర్‌లకు లేదని ఆయన పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై స్పందిస్తూ, హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేసిన చరిత్ర బిఆర్‌ఎస్‌దేనని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్‌లో హరీష్ రావు పాత్ర ఉందని, తమపై నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకుని, దమ్ముంటే నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని సవాల్ చేశారు. మాకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు అని హెచ్చరించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, కేసీఆర్‌కు మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరపడంలో కేంద్రం వెనకాడుతోందని విమర్శించారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుందని వెల్లడించారు. వచ్చే రెండు మూడు రోజుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందన్నారు. మే నెలలోనే కార్పొరేషన్ చైర్మన్ పదవులను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.

Next Story