ఢిల్లీకి బయలుదేరిన టీపీసీసీ చీఫ్ . ఆల్రెడీ చేరుకున్న CM రేవంత్

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-01 15:22:27  IST  )

టీపీసీసీ(TPCC) చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) బృందం ఢిల్లీకి బయల్దేరింది.

ఢిల్లీకి బయలుదేరిన టీపీసీసీ చీఫ్ . ఆల్రెడీ చేరుకున్న CM రేవంత్
X

దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ(TPCC) చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) బృందం ఢిల్లీకి బయల్దేరింది. ఆయనతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్(Ponnam Prabhakar Goud), కొండా సురేఖ(Konda Surekha), బీసీ ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, వాకిటి శ్రీహరి, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ప్రకాష్ గౌడ్, ఈర్లపల్లి శంకరయ్య తదితర నేతలు ఉన్నారు. రేపు బీసీలకు రాజకీయ విద్యా ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు(BC Reservation) పెంచుతూ శాసనసభలో చేసిన చట్టాన్ని పార్లమెంట్‌లో ఆమోదించాలని ఢిల్లీలో బీసీ సంఘాల ధర్నా చేపట్టారు.

జంతర్ మంతర్ వద్ద జరిగే బీసీ సంఘాల మహా ధర్నాలో పీసీసీ చీఫ్, మంత్రులు, బీసీ ఎమ్మెల్యేల బృందం పాల్గొననున్నది. మహాధర్నా అనంతరం కేంద్ర మంత్రులు, జాతీయ పార్టీ నేతలను కలిసి బీసీ రిజర్వేషన్ల పెంపు చట్టానికి మద్దతు తెలపాలని తెలంగాణ మంత్రుల బృందం కోరనుంది. మరోవైపు సాయంత్రమే బయల్దేరిన సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).. ఆల్రెడీ ఢిల్లీ చేరుకున్నారు. ఈ ధర్నాకు రావాలని బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) నేతలకు బీసీ సంఘాలు ఆహ్వానం అందించారు. వారి హాజరుపై సందిగ్ధత నెలకొంది.

Next Story