- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎస్సీ వర్గీకరణ, కులగణనపై కాంగ్రెస్ భారీ బహిరంగ సభలు.. ఎక్కడంటే: టీపీసీసీ

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన నిర్వహించిన సీఎల్పీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ, కులగణన నేపథ్యంలో మెదక్ పరిధిలోని గజ్వేల్, సూర్యపేటలో భారీ బహిరంగ సభలకు తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ చేసింది. బీసీ కులగణన విజయవంతంపై సూర్యపేటలో బహిరంగ సభ పెట్టనున్నట్లు తెలిసింది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ముఖ్యఅతిథిగా పిలిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణపై మెదక్ పరిధిలోని గజ్వేలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. ఈ సభకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గేను ముఖ్య అతిథిగా పిలిచేందుకు టీ కాంగ్రెస్ నిర్ణయించింది. సభలకు కాంగ్రెస్ అగ్రనేతలను ఆహ్వానించేందుకు కోసం ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు సిద్ధం అయ్యారు. ఈ మేరకు తాజాగా పీసీసీ చీఫ్ వివరాలు వెల్లడించారు.
ఇటీవల పార్టీ లైన్ దాటుతున్న నేతల అంశం పై సీఎల్పీ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. ఎవరైనా నేతలు కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తే.. కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నేతలు పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తే.. కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పార్టీ విధానాల పై అనుమానాలు ఉంటే.. అంతర్గతంగా చర్చించాలని సీనియర్ నేతలు సూచించినట్లు తెలిసింది.
ఇక, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంపై చర్చించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, పథకాలను ప్రజలకు తీసుకెళ్లాలని మంత్రులకు, ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేసినట్లు తెలిసింది. కులగణనపై విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పి కొట్టేందుకు పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది.